మనోదర్పణం
నిర్విరామ సేవికలా
నన్నంటిపెట్టుకుని వుంటుంది
నానవ్వునీ ఏడ్పునీ
అనునిత్యం అదే నాకు చూపిస్తుంది
నేను దానిని కొనితెచ్చుకున్నానన్న
విషయం మర్చిపోయి
నన్నే నిర్వచించే ప్రయత్నం చేస్తుంది
నేనెవరినన్న ప్రశ్న నాకింకా తోచకముందే
నువ్విదేనంటూ ఓ రూపాన్ని
నాకళ్ళముందు నిలిపేస్తుంది
అది చెప్పేదే నిజమని
నన్ను అన్ని వేళలా నమ్మిస్తుంది
నన్ను నేను చూడాలనుకున్నపుడల్లా
దాని ముందుకే నను నడిపిస్తుంది
ఆరురకాల మరకలతో
తనని తాను నింపుకుంటుంది
ఆదమరిచానంటే
ఆమచ్చలన్నీ నావేనంటుంది
కుడినెపుడూ ఎడమగానే
చూపిస్తుంది
తలక్రిందులవనంతవరకూ
అది తన తప్పు కాదు పొమ్మంటుంది
నిశ్చలంగా వుందంటే
నను నిలబెట్టిన ప్రతిభ తనదేనంటుంది
నిలువలేక జారిందంటే
అష్టవంకరలూ నాకంటగడుతుంది
నా చుట్టూ వెలుతురున్నంతసేపూ
నాతో యిలాగే ఆడుకుంటుంది
అది నిస్సహాయంగా చేతులెత్తినపుడే
నాలోని వెలుగు నాకర్ధమవుతుంది
______
(12-5-2010 నాటి నవ్యలో ప్రచురితం)
నన్నంటిపెట్టుకుని వుంటుంది
నానవ్వునీ ఏడ్పునీ
అనునిత్యం అదే నాకు చూపిస్తుంది
నేను దానిని కొనితెచ్చుకున్నానన్న
విషయం మర్చిపోయి
నన్నే నిర్వచించే ప్రయత్నం చేస్తుంది
నేనెవరినన్న ప్రశ్న నాకింకా తోచకముందే
నువ్విదేనంటూ ఓ రూపాన్ని
నాకళ్ళముందు నిలిపేస్తుంది
అది చెప్పేదే నిజమని
నన్ను అన్ని వేళలా నమ్మిస్తుంది
నన్ను నేను చూడాలనుకున్నపుడల్లా
దాని ముందుకే నను నడిపిస్తుంది
ఆరురకాల మరకలతో
తనని తాను నింపుకుంటుంది
ఆదమరిచానంటే
ఆమచ్చలన్నీ నావేనంటుంది
కుడినెపుడూ ఎడమగానే
చూపిస్తుంది
తలక్రిందులవనంతవరకూ
అది తన తప్పు కాదు పొమ్మంటుంది
నిశ్చలంగా వుందంటే
నను నిలబెట్టిన ప్రతిభ తనదేనంటుంది
నిలువలేక జారిందంటే
అష్టవంకరలూ నాకంటగడుతుంది
నా చుట్టూ వెలుతురున్నంతసేపూ
నాతో యిలాగే ఆడుకుంటుంది
అది నిస్సహాయంగా చేతులెత్తినపుడే
నాలోని వెలుగు నాకర్ధమవుతుంది
______
(12-5-2010 నాటి నవ్యలో ప్రచురితం)
కామెంట్‌లు
నాతో యిలాగే ఆడుకుంటుంది
అది నిస్సహాయంగా చేతులెత్తినపుడే
నాలోని వెలుగు నాకర్ధమవుతుంది
చాలా బాగుంది అండి. భావము