బాసర క్షేత్రంలో చదివిన కవిత "దాగుడుమూతలు"
గిరిజగా నీరూపు తనివితీరా చూడబోతే
సగము దేహము శివునిలో దాచుకుంటావు
అమ్మ కావాలంటూ దిగులుగా నే నిలబడితే
గంగవై నా దరికి పరుగుతీస్తావు
నిలువెల్లా నను తడిమి మురిసిపోతావు
లక్ష్మిగా భావించి నీ ఒడిని చేరబోతే
విశ్వమంతా కళలుగా వ్యాపించిపోతావు
ఒక్కచోటే నిను నిలపలేక వెర్రిమొహం నే వేస్తే
తులసివై నా యింటి ముంగిట నవ్వుతుంటావు
నిశ్శబ్ద ప్రేమ కవచమై నను చుట్టుకుంటావు
భారతిగా నిను తలచి నీ వెంట నడువబోతే
వేదవేదాంగాలుగా విస్తరిస్తావు
వేలగ్రంధాలలో నిను వెతకలేక వేసారిపోతే
గోమాతవై నా ఎదుటికి నడిచివస్తావు
అవిద్యను పారద్రోలగల అమృతాలను నానోటికి అందజేస్తావు
అమ్మా!
పసిదాననని నాతో దోబూచులాడుతుంటావా!
పరమదయతో పరమాత్మ తత్వాన్ని నేర్పుతుంటావా!
_______________
కామెంట్‌లు
I am sorry.. that I am not aware ... are these some of your collections? or you wrote by your self..?
just out of curiosity :)
Siva Cheruvu
మీ బ్లాగ్ చూసినందుకు సంతోషం గా ఉంది..
నమస్సులతో..
శివ చెరువు