సతీసుమతి
“ సతీసుమతి !” ఆ పేరునొకసారి పలికి , “ అబ్బా! అసలు ఎలా పెట్టారక్కా అమ్మానాన్నా మనకీ పేర్లు! ” అన్నాను సాలోచనగా ఒకింత అసహనంగా. “ ఏఁ! ఇపుడు మనపేర్లకి ఏమయింది ?” దిండు మీద తల ఆనించి దుప్పటి సర్దుకుంటూ అక్క నవ్వింది. “చాలా ఇష్టంగా పెట్టింది తెలుసా అమ్మ మనకు సావిత్రి , సుమతి అనే పేర్లు ! ” అంది. “ ఎందుకు తెలియదూ! బాగా తెలుసు. ఉత్త సావిత్రి , ఉత్త సుమతి కూడా కాదు. సతీసావిత్రి , సతీ సుమతి” అన్నాను నేను కూడా నవ్వుతూ. “ ఇంకానయం , మా ఆఫీసులో వాళ్ళకి నా పూర్తిపేరు సతీసుమతి అని తెలియదు. ఉత్త సుమతి అనుకునే వెక్కిరిస్తున్నారు” అక్క పక్కనే నడుం వాలుస్తూ స్వగతంలా అన్నాను. “ వెక్కిరించడం ఏమిటే ? వెక్కిరించడం ఎందుకు ? అక్క ఆశ్చర్యపోయింది. “ హ్మ్.. వెక్కిరించడం అంటే వెక్కిరించడం కాదులే. కొన్ని సందర్భాలలో కొంత పరిహాసంగా మాట్లాడతారు.” “ అవునా , ఏమిటా సందర్భాలు!” నేను మరొకసారి చిన్నగా నిట్టూర్చి వివరించడానికి పూనుకున్నాను. “ఏమిటోనక్కా , పతివ్రతల పేర్లలో కూడా సుమతి పేరంటే జనాలకి మరీ పరిహాసం. మిగిలిన వాళ్ళలో ఏదో కాస్త ధైర్యసాహసాలు అవీ కనిపిస్తా...
కామెంట్లు
cbraoin at gmail.com