విఘ్నరాజ శతకము (1-24 పద్యములు)
1. చల్లనయిన దేవ చంద్రమౌళి తనయ
భానుతేజరూప భక్తసులభ!
ఆది జనని పుత్ర యగ్నిసోమాత్మకా!
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
భానుతేజరూప భక్తసులభ!
ఆది జనని పుత్ర యగ్నిసోమాత్మకా!
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
2. సన్నకన్నులందు సంద్రమంత కరుణ
ప్రేమ నింపుకొన్న పెద్దబొజ్జ
చింతలన్ని వినెడు చెవులు గల్గిన తండ్రి
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
3. సవితృకాంతి నీకు సరిరాని చిరువెల్గు
తారలన్ని వట్టి తళుకురాళ్ళు
వెలుగులకును నీవు వెలుగువనితెలిసి
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
4. కామధేనువీవె కల్పతరువు నీవె
భక్తులెపుడు గోరు భాగ్యమీవె
ఇహము పరము నీవె ఈశ్వరనందనా!
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
5. దిక్కులన్ని నిండి వాక్కు కందని నిన్ను
పిలిచి పసుపులోన నిలిపి నట్లు
చెప్ప బూనుకొంటి చిన్ని
పద్యములందు
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
విశ్వ సృజన
వేళ విధియుఁ గొలిచె
నీదు స్మరణ
తోనె నిలచురా విద్యలు
వేడుకొందు
నిన్ను విఘ్నరాజ
7. నలువ కైన
గాని నారాయణున కైన
చిక్కబోదు జయము శివున కైన
మొదట నిన్ను దలచి మ్రొక్కుకొనక యున్న
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
8. రిపుల గెలువ
దలచి త్రిపురారియును శౌరి
తొలుత భక్తిఁ నిన్ను కొలిచి
నారు
తలచె రణమున నిను లలితాంబ సైతము
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
9. నిష్ఠ తోడ జేసి నీదు షడక్షరి
యశము జయము
నొందె నసురవైరి
మట్టుబెట్టగలిగె
మధుకైటభాదులన్
వేడుకొందు
నిన్ను విఘ్నరాజ
10. ఏకదంత నీదు ఏకాక్షరీ మంత్ర
ఘనత వలనఁ
వ్యాస మునివరునకు
వేద రాశిఁ
బంచు వివరమంతయుదోచె
వేడుకొందు
నిన్ను విఘ్నరాజ
11. వేలసార్లు వినిన విసుగు రానివి తండ్రి
నిరుపమాన మయిన నీదు కథలు
పాపహరము కాగ పలుమార్లు తలచెద
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
12.
బ్రహ్మ తెలిపె మొదట పారాశర మునికి
పిదప మౌని వలన
భృగువు వినెను
క్లేశముల నణచు
గణేశ పురాణమున్
వేడుకొందు
నిన్ను విఘ్నరాజ
13. కట్టి
కుడుప గాను గతజన్మ పాపముల్
సోమకాంతు డనెడి
భూమిజాని
భృగువు నాశ్రయించి
వినెను నీదు మహిమ
వేడుకొందు
నిన్ను విఘ్నరాజ
14. అష్టవిధములైన యాకృతులను దాల్చి
వెలసినావు వివిధ స్థలములందు
భృత్యుల నరయగను దైత్యుల నడచగన్
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
15. శ్రీహరి తపముగని సిద్దేశ్వరుండును
హరుని తపముగని మహాగణపతి
భువిని వెలసినారు పుణ్యస్థలములందు
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
16. సింధు
దైత్యు నడచి శ్రీమయూరేశుగ
వెలసి నావు నీవు, నిలచి నావు
విఘ్న దైత్యు కూల్చి
విఘ్నేశ్వరునిగను
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
17. పార్ధివ
గణపతిని భక్తితో పూజించ
పార్వతికి సుతునిగ వచ్చి నావు
లీలగ గిరిజాత్మ లేన్యాద్రి గిరులకు
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
18. వల్లి
నగరమందు భల్లాలుడనువాడు
బాలుడయ్యు
పరమభక్తి జూప
వెలసినావు
వాని పేరుతోనట నీవు
వేడుకొందు
నిన్ను విఘ్నరాజ
19. పుటుకలోని
దొసగు పటుతపమునదాటి
కీర్తినందినాడు గృత్సమదుడు
మంత్ర ఋషిగ మారి మన్ననల్
గొనినాడు
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
20. భద్రకమను
చోటఁ వరద వినాయక
వెలసి గృత్సమదుని వలన నీవు
మునికి వరము గాను
పుత్రునొసగినావు
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
21. నీకు
భక్తుడయ్యు లోకకంటకుడైన
మునిసుతుడు త్రిపురుని దునుమ
గోరి
నిన్ను గొలిచె శివుడు నెగ్గె
రణమునందు
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
22. దండకాటవిన్
ప్రచండ తపముజేసి
శూలి పొందినాడు శుభము సర్వ
కామదమగు నీదు నామ సహస్రము
వేడుకొందు
నిన్ను విఘ్నరాజ
23. పాతక మొనరించి
ప్రతిగ శాపము నొంద
దాని బాపుకొనగ తపముజేసి
నీదు విగ్రహమును నెలపె వేల్పులరాజు
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
దాని బాపుకొనగ తపముజేసి
నీదు విగ్రహమును నెలపె వేల్పులరాజు
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
భక్తి తోడ నీదు స్ఫటికమూర్తి
చింతితముల దీర్చు చింతామణి వనుచు
వేడుకొందు నిన్ను విఘ్నరాజ
కామెంట్‌లు