అనివార్యం
అశాంతిని కొనుక్కున్నాను
అస్తిత్వాన్ని పణంగా పెట్టి
ఆశ్చర్యపోతావెందుకు!!
ప్రేమలో యిది ఆనవాయితీ అట
వ్యక్తిత్వపు మేరుపర్వతాన్ని
ఎడమ చేతి గుప్పెట లో దాచి
నీ పాదముద్రల పరవశాన్ని
హృదయఫలకం పై నిలుపుకున్నాను
బాధపడతావెందుకు!?
ఆత్మార్పణలో అనిర్వచనీయమైన
ఆనందముందట
నా భావాల సూత్రాన్ని
గాలిలోకి ఎగరేసి
నీ హృదయపతంగాన్ని
కూలదోశాను
అలిగి చూస్తావెందుకు?
ఆటలో గెలవాలంటే
ఆ మాత్రం అల్లరి తప్పదట
నాలోని కన్నీటి మడుగుల్ని
హృదయపు మూలల్లో నొక్కి పట్టి
నీ కోసం చిరునవ్వుల మాలల్ని
పెదవులపై మోస్తున్నాను
అడ్డగిస్తావెందుకు!?
వలచిన ప్రతివారికీ యిది
అనివార్యమట
అస్తిత్వాన్ని పణంగా పెట్టి
ఆశ్చర్యపోతావెందుకు!!
ప్రేమలో యిది ఆనవాయితీ అట
వ్యక్తిత్వపు మేరుపర్వతాన్ని
ఎడమ చేతి గుప్పెట లో దాచి
నీ పాదముద్రల పరవశాన్ని
హృదయఫలకం పై నిలుపుకున్నాను
బాధపడతావెందుకు!?
ఆత్మార్పణలో అనిర్వచనీయమైన
ఆనందముందట
నా భావాల సూత్రాన్ని
గాలిలోకి ఎగరేసి
నీ హృదయపతంగాన్ని
కూలదోశాను
అలిగి చూస్తావెందుకు?
ఆటలో గెలవాలంటే
ఆ మాత్రం అల్లరి తప్పదట
నాలోని కన్నీటి మడుగుల్ని
హృదయపు మూలల్లో నొక్కి పట్టి
నీ కోసం చిరునవ్వుల మాలల్ని
పెదవులపై మోస్తున్నాను
అడ్డగిస్తావెందుకు!?
వలచిన ప్రతివారికీ యిది
అనివార్యమట
కామెంట్‌లు
మీకు చెప్పేంత గొప్పవాణ్ణి కాదు కాని,
"నీ హృదయపతంగాన్ని కూలదోశాను
అలిగి చూస్తావెందుకు?
ఆటలో గెలవాలంటే ఆ మాత్రం అల్లరి తప్పదట"
మొదటి లైను ఏదో భావ సంచలనాన్ని చూపిస్తుంటే రెండో లైను మాత్రం అల్లరి అంటూ ఆ సంచలనాన్ని కప్పేసింది. ఏమంటారు?