కోదండ రాముడే
పల్లవి : కోదండ రాముడే కోమలీ నువ్వు
కోరి పూజలు చేయ కోమలీ తాను
కదలి వచ్చాడమ్మ కలికీ మిథిలకు
కనులెత్తి చూడవె కమలాక్షి రావె
చరణం : నీలాల మబ్బుల్ని పోలిన వాడు
నిండైన చంద్రుడి నిగ్గులవాడు
నిష్టూరమన్నది నేర్వని వాడు
నిత్యపు నవ్వుల సత్యము వాడు
చరణం : కరకు తాటకినొక్క శరముతో గూల్చి
మాయావి మారీచు మదమునే యణచి
కౌశికు యాగము వాసిగ గాచి
గౌతము పత్నికి గౌరవమిచ్చి
చరణం : హరచాపమే త్రుంచి అవలీలగాను
అరవిందనేత్రుడు అల్లుడైనాడు
వడిగాను రావమ్మ వైదేహి నువ్వు
వరమాల తేవమ్మ వరమిది నీకు
*****
కోరి పూజలు చేయ కోమలీ తాను
కదలి వచ్చాడమ్మ కలికీ మిథిలకు
కనులెత్తి చూడవె కమలాక్షి రావె
చరణం : నీలాల మబ్బుల్ని పోలిన వాడు
నిండైన చంద్రుడి నిగ్గులవాడు
నిష్టూరమన్నది నేర్వని వాడు
నిత్యపు నవ్వుల సత్యము వాడు
చరణం : కరకు తాటకినొక్క శరముతో గూల్చి
మాయావి మారీచు మదమునే యణచి
కౌశికు యాగము వాసిగ గాచి
గౌతము పత్నికి గౌరవమిచ్చి
చరణం : హరచాపమే త్రుంచి అవలీలగాను
అరవిందనేత్రుడు అల్లుడైనాడు
వడిగాను రావమ్మ వైదేహి నువ్వు
వరమాల తేవమ్మ వరమిది నీకు
*****
కామెంట్‌లు