ముత్యాలమాల
మిథిల తనయా పతిని కొలువగ
మేలి పలుకుల నేరి తేరే
మాటలన్నీ మాలలల్లీ
మోహనునికీరే
కరుణ చిలికెడి కమల నయనుని
కన్నులారా కాంచరే శ్రీ
రామచంద్రుని రమ్యరూపము
రక్తితోగనరే
కల్మషములను కాల్చివేసెడి
పరమ మంత్రము పలుకరే శ్రీ
రామనామమె రసపుఝరియని
భక్తితోననరే
ధర్మమూర్తీ దాశరథినీ
మదిని దాల్చీ మసలరే శ్రీ
రామబాణమె రక్షయనుచును
ముక్తిచేకొనరే
ఇహము పరముల నీయగలిగిన
ఇనకులేశుని కొలువరే యిక
సకలలోకపు సార్వభౌముని
శరణుశరణనరే
*****
కామెంట్‌లు